తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వోల్వో బస్సులో మంటలు..నలుగురు సజీవ దహనం - four died

ఉత్తరప్రదేశ్​లోని మెయిన్​పురిలో ఘోర ప్రమాదం జరిగింది. దిల్లీ నుంచి లఖ్​​నవూ వెళ్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బస్సులో మంటలు... నలుగురు సజీవ దహనం

By

Published : Mar 25, 2019, 12:56 PM IST

బస్సులో మంటలు... నలుగురు సజీవ దహనం
ఉత్తరప్రదేశ్​లోని మెయిన్​పురిలో దిల్లీ నుంచి లఖ్​​నవూ వెళ్తున్న వోల్వో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆగ్రా- లఖ్​​నవూ ఎక్స్​ప్రెస్​ వేపై ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్​ తప్పించుకున్నాడు.

అకస్మాత్తుగా మంటలు...

దిల్లీ నుంచి లఖ్​​నవూకు తెల్లవారుజామున ప్రయాణికులతో వోల్వో బస్సు బయలుదేరింది. ఆగ్రా- లఖ్​​నవూ ఎక్స్​ప్రెస్​వేపై వెళుతున్న బస్సు... మెయిన్​పురి సమీపానికి చేరుకోగానే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. నిద్రలో ఉన్న ప్రయాణికులకు కొంతసేపటి వరకు ఏం జరుగుతుందో తెలియలేదు. అంతలోనే మంటలు పెరిగాయి. కొద్ది సమయంలోనే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details