తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్ అంశంలో దౌత్యపరంగా కేంద్రం విఫలం'

కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చర్చించాలనుకోవడం... దౌత్యపరంగా కేంద్రం వైఫల్యానికి నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది. భారత్.. మిత్ర దేశాలతో సంప్రదింపులు జరిపి ఈ సమావేశం జరగుకుండా చూడాలని ప్రధానికి సూచించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్​  సింఘ్వీ.

'కశ్మీర్ అంశంలో దౌత్యపరంగా కేంద్రం విఫలం'

By

Published : Aug 16, 2019, 8:08 PM IST

Updated : Sep 27, 2019, 5:37 AM IST

కశ్మీర్ అంశంలో దౌత్యపరంగా కేంద్రం ఘోర పరాభవం చెందిందని కాంగ్రెస్ విమర్శించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్​ఎస్​సీ) కశ్మీర్​ అంశంపై చర్చించాలనుకోవడమే ఇందుకు నిదర్శమని ఆ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్​ సింఘ్వీ వ్యాఖ్యానించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్​. జైశంకర్​ ఇటీవలే చైనాలో పర్యటించినా ఇలా జరగడం వ్యూహాత్మక వైఫల్యమని దుయ్యబట్టారు.

భారత మిత్ర దేశాలను సంప్రదించి ఈరోజు రాత్రి జరగబోయే యూఎన్​ఎస్​సీ సమావేశాన్ని నిలిపివేసేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు సింఘ్వీ. ఈ సూచన చేసినందుకు తనను జాతి వ్యతిరేకిగా భాజపా చిత్రీకరిస్తుందేమోనని భయంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

జమ్ముకశ్మీర్​ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అంశంపై శుక్రవారం రాత్రి సమావేశం కానుంది యూఎన్​ఎస్​సీ. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్​ లేఖ అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

Last Updated : Sep 27, 2019, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details