నమస్తే ట్రంప్: ఆతిథ్యానికి సర్వం సిద్ధం- భద్రత కట్టుదిట్టం 'నమస్తే ట్రంప్'... భారత్, అమెరికాను మాత్రమే కాదు ప్రస్తుతం యావత్ ప్రపంచాన్నే ఈ పదం ఊపేస్తోంది. భారత్ ఆతిథ్యాన్ని తొలిసారి కళ్లారా చూసేందుకు.. తనివితీరా అనుభవించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రానున్నారు. అగ్రరాజ్యాధిపతికి ఘన స్వాగతం పలికేందుకు భారత్ సిద్ధమైంది.
అమిత్ షా సమీక్ష...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అహ్మదాబాద్ చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు.
అమిత్ షా, కేంద్ర హోంమంత్రి భద్రతా నీడలో...
విమానాశ్రయం నుంచి డొనాల్డ్ ట్రంప్, మెలానియా వచ్చే మార్గంలో 100 వాహనాలతో ఫైనల్ రిహార్సల్‌ను అధికారులు పూర్తి చేశారు.
'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి వేదికైన మోటేరా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, భద్రతా దళాలు సమీక్ష నిర్వహిస్తున్నాయి.
- 25 మంది ఐపీఎస్ అధికారుల నేతృత్వంలోని 10 వేల మంది భద్రతా దళాలను రోడ్ షో, నమస్తే ట్రంప్ కార్యక్రమానికి మోహరించారు.
- యూఎస్ సీక్రెట్ సర్వీస్, జాతీయ భద్రతా దళాలు, ప్రత్యేక భద్రతా దళం నీడలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
- ట్రంప్ వచ్చే మార్గంలో యాంటీ డ్రోన్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఈ మార్గంలో ఎన్ఎస్జీకి చెందిన యాంటీ స్నైపర్ బృందం ట్రంప్ వాహనశ్రేణితో పాటు ఉండనుంది.
- ట్రంప్ రాకకు ముందే అమెరికా వాయుసేనకు చెందిన నాలుగు సీ17 కార్గో విమానాలు భద్రత, సమాచార పరికరాలతో అహ్మదాబాద్‌కు చేరుకున్నాయి.
- ఇందులో ట్రంప్ అధికారిక విమానం మెరైన్ వన్, బీస్ట్ వాహనం కూడా ఉన్నాయి.
హస్తినలోనూ కట్టుదిట్టం...
- ఎన్నడూ లేని విధంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ భద్రతపై బలగాలన్నీ హైఅలర్ట్‌లో ఉన్నాయి.
- దిల్లీలో ట్రంప్‌కు ఆతిథ్యమిచ్చే ఐటీసీ మౌర్య హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు.
- సైన్యం, పారామిలిటరీ సభ్యులతో కూడిన రక్షణ బృందాలు ట్రంప్ ప్రయాణిచ్చే మార్గాల్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.
- యూఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు భారత భద్రతా దళాలు సహకరిస్తున్నాయి.
- ఎన్ఎస్జీకి చెందిన యాంటీ డ్రోన్, స్నిపర్ బృందాలు, స్వాట్ కమాండోలు, జాగిలాల బృందం, పరాక్రం వాహనాలను హోటల్‌కు దగ్గరున్న వివిధ ప్రాంతాల్లో మోహరించారు.
- రాత్రి వేళ కూడా పనిచేసే 100కు పైగా హై డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను సర్దార్ మార్గం నుంచి మౌర్య హోటల్‌కు వెళ్లే మార్గంలో ఏర్పాటు చేశారు.
- బలగాలకు దిల్లీ పోలీసులు పూర్తి సహకారమిస్తున్నారు. ట్రంప్ వాహనశ్రేణి వెళ్లే మార్గాల్లో డబుల్ బారికేడ్లను ఏర్పాటు చేశారు.
- ఇండియా గేట్, రాజ్‌పథ్ ప్రాంతాలు భారత్, అమెరికా జెండాలతో నిండిపోయాయి.
సబర్మతిలో...
అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమానికి సోమవారం సతీసమేతంగా ట్రంప్ వెళ్లనున్న నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.