తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస - MASOOD AZHAR

జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. అజార్​పై చర్యలు తీసుకోకుండా నాలుగుసార్లు అడ్డుపడిన చైనా ఈసారి అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ దేశాల ఒత్తిడితో వైఖరి మార్చుకుంది డ్రాగన్​ దేశం.

అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన ఐరాస

By

Published : May 1, 2019, 7:26 PM IST

Updated : May 2, 2019, 12:29 AM IST

భారత్​ భారీ దౌత్య విజయాన్ని సాధించింది. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు, కరుడుగట్టిన ఉగ్రవాది మసూద్​ అజార్​ను​ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి. ఇంత కాలం అడ్డుతగిలిన చైనా వైఖరి మార్చుకొని అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు లేవనెత్తిన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది.

మసూర్​ అజార్​ ఆస్తులను ఐరాస స్తంభింపజేయనుంది. అలాగే విదేశాలకు వెళ్లడాన్ని నిషేధించనుంది.

అడ్డుతొలగిన చైనా

మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస గుర్తించకుండా ఇప్పటివరకు నాలుగుసార్లు చైనా అడ్డుపడింది. ఈ ఏడాది మార్చిలోనూ అజార్​పై ఫ్రాన్స్​, అమెరికా, బ్రిటన్ ​ప్రవేశపెట్టిన ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మొత్తానికి భారత్​ సహా అమెరికా, ఫ్రాన్స్​, బ్రిటన్​ దేశాల ఒత్తిడికి తలొగ్గింది డ్రాగన్​ దేశం. అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు తెలిపిన అభ్యంతరాలను వెనక్కి తీసుకుంది. మసూద్​ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.

ముంబయిలో ఉగ్రదాడి, పుల్వామా ఉగ్ర ఘాతుకానికి పాల్పడింది జైషే మహ్మద్​ సంస్థే. అప్పటి నుంచి మసూద్​ అజార్​ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించేందుకు భారత్​ ఎంతో కృషి చేసింది. చాలా దేశాలతో చర్చలు జరిపింది. చివరకు విజయం సాధించింది.

Last Updated : May 2, 2019, 12:29 AM IST

ABOUT THE AUTHOR

...view details