తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్ బాధితురాలిని దిల్లీకి తరలించండి' - DELHI AIMS

ఉన్నావ్ కేసు బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం బాధితురాలు అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం లఖ్​నవూలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

'ఉన్నావ్ బాధితురాలిని దిల్లీకి తరలించండి'

By

Published : Aug 5, 2019, 7:14 PM IST

ఇటీవలే ప్రమాదానికి గురైన ఉన్నావ్ కేసు బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. లఖ్​నవూ నుంచి దిల్లీలోని ఎయిమ్స్​కు వాయుమార్గంలో తీసుకెళ్లాలని సూచించింది.

ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. లఖ్​నవూలోని కింగ్​జార్జ్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మెరుగైన వైద్య సదుపాయం కోసం కుటుంబ సభ్యులు చేసుకున్న వినతి మేరకు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అదే ప్రమాదంలో గాయపడిన న్యాయవాది కుటుంబీకులు కోరితే అతన్ని కూడా ఎయిమ్స్​కు తరలించాలని సుప్రీం కోర్టు సూచించింది.

ఇదీ జరిగింది...

దేశవ్యాప్తంగా ఉన్నావ్​ అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే కుల్​దీప్​ సెనగర్​ నిందితుడు. ఆయనను 2018 ఏప్రిల్‌ 13న అరెస్టు చేశారు. బాలికపై ఎమ్మెల్యే అత్యాచారం చేశాడంటూ ఆ చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. సీఎం కార్యాలయం ఎదుట బాధితురాలు బలిదానానికి సిద్ధపడటం వల్ల ఈ కేసు సంచలనమైంది.

రాయ్​బరేలీ జైలులోని తమ బంధువును చూసేందుకు... కొద్ది రోజుల క్రితం బాధితురాలు సహా ఆమె కుటుంబసభ్యులు, న్యాయవాది బయలుదేరారు. దారి మధ్యలో వారి వాహనాన్ని ఓ ట్రక్కు వేగంగా ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బాధితురాలి పిన్ని, మేనత్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇదీ చూడండి: కశ్మీర్ డైరీ​: 70 ఏళ్ల సమస్య- ఒక్క రోజులో చకచకా

ABOUT THE AUTHOR

...view details