ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్ బాధితురాలి సోదరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ కోల్పోయిన తమకు సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తమ నివాసానికి వచ్చి హామీ ఇచ్చేంత వరకు అంత్యక్రియలు జరిపించబోమని స్పష్టం చేశారు. నిందితులకు మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
'మా డిమాండ్ ఏంటంటే.. సీఎం యోగీ ఇక్కడకు వచ్చి సత్వర న్యాయం చేయాలి. మా అక్క అంత భయానక ఘటన చూసింది.. వారి రాక్షస చర్యకు బలైంది. ఆమెను సజీవ దహనం చేశారు. సాక్ష్యాలు కళ్లెదురుగానే ఉన్నాయి. ఇంకేం కావాలి? మేము తరువాత కోర్టుల చుట్టూ తిరిగి పోరాడలేము.. మేము అంత డబ్బు ఉన్నవాళ్లం కాదు. మేము రేపు ప్రభుత్వాన్ని కలవగలమో లేదో.. అందుకే మాకు నేడే న్యాయం కావాలి. జిల్లా అధికారులను అడిగితే వారు మమ్మల్నే అక్కడికి రమ్మని పిలుస్తున్నారు. మేము అక్కడికి వెళ్లి ఏం చేయాలి? ఆయన్నే (సీఎం) ఇక్కడికి రానివ్వండి.. ఆయన కూడా చూస్తారు కదా మేము ఎలాంటి దుర్భర స్థితిలో ఉన్నామో!'
-ఉన్నావ్ బాధితురాలి సోదరి.