ఉన్నావ్ అత్యాచార బాధితురాలికి నిప్పుపెట్టి తీవ్రంగా గాయపరిచిన దుండగులు.. ఇప్పుడు ఆమె కుటుంబసభ్యులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. భవిష్యత్లో భయంకర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆమె బాబాయిని హెచ్చరించారు నిందితుల తరఫు వ్యక్తులు. శివం కుటుంబ సభ్యులు తన దుకాణం వద్దకు వచ్చి బెదిరించినట్లు తెలిపారు బాధితురాలి బాబాయి.
" నీ దుకాణాన్ని తగలబెడతాం. నిన్ను ప్రాణాలతో బతకనివ్వం అని బెదిరించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. "
- బాధితురాలి బాబాయి.
భద్రత ఏర్పాటు..
బాధితురాలి కుటుంబ సభ్యులపై బెదిరింపులకు పాల్పడిన సమాచారం అందినట్లు తెలిపారు జిల్లా ఎస్పీ విక్రాంత్ వీర్. ఆమె కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.