తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాధితురాలి తరలింపుపై కుటుంబానిదే నిర్ణయం'

ఉత్తర్​ప్రదేశ్​ రాయ్​బరేలీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలిని దిల్లీకి తరలించే అంశంపై సుప్రీం కోర్టు విచారించింది.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నందున.. ఎక్కడ వైద్యం చేయించాలనే అంశంపై కుటుంబసభ్యులే నిర్ణయించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది.

'బాధితురాలి తరలింపుపై కుటుంబానిదే నిర్ణయం'

By

Published : Aug 2, 2019, 1:40 PM IST

Updated : Aug 3, 2019, 6:58 AM IST

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలిని లఖ్​నవూ నుంచి దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించేందుకు ఆమె కుటుంబానికి స్వేచ్ఛనిచ్చింది సుప్రీం కోర్టు. ఉత్తర్​ప్రదేశ్ రాయ్​బరేలీలో ఇటీవల బాధితురాలు అనుమానాస్పద రీతిలో ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదానికి ముందే తమకు ప్రాణ హాని ఉందని బాధిత కుటుంబం భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా విచాణ చేపట్టింది సుప్రీం.

అత్యాచార బాధితురాలు అపస్మారక స్థితిలో ఉన్నారని, కృత్రిమ శ్వాస అందిస్తున్నారని బాధితురాలి న్యాయవాది వి. గిరి ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని లఖ్​నవూ ఆసుపత్రి నుంచి దిల్లీ ఎయిమ్స్​కు తరలించేందుకు కుటుంబానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. దిల్లీకి తరలించాలని అనుకుంటే సుప్రీం కోర్టు ప్రధాన కార్యదర్శిని సంప్రదించవచ్చని స్పష్టం చేసింది.విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

కానీ బాధితురాలిని దిల్లీకి తరలించే విషయమై ఆమె తండ్రి సందిగ్ధతలో ఉన్నారని కోర్టుకు నివేదించారు బాధితురాలి న్యాయవాది.
మీడియాకు ఆదేశాలు...

బాధితురాలి గుర్తింపును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ బహిర్గతం చేసే కథనాలు ఇవ్వరాదని మీడియాకు సుప్రీం ఆదేశించింది.

ఇదీ చూడండి: 'ఉన్నావ్'​ విచారణకు సుప్రీం 45 రోజుల గడువు

Last Updated : Aug 3, 2019, 6:58 AM IST

ABOUT THE AUTHOR

...view details