తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జీవిత ఖైదుపై హైకోర్టుకు 'ఉన్నావ్​' దోషి సెంగార్​ - Unnao rape case: Kuldeep Sengar moves Delhi HC challenging conviction, life imprisonment

ఉన్నావ్ అత్యాచార కేసులో విధించిన జీవిత ఖైదును సవాల్​ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు దోషి, భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్ సింగ్​ సెంగార్​. డిసెంబర్​ 20న ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని అభ్యర్థించాడు.

sengar
జీవితఖైదుపై హైకోర్టుకు సెన్​గర్​

By

Published : Jan 15, 2020, 10:54 PM IST

భాజపా బహిష్కృత ఎమ్మెల్యే, ఉన్నావ్ అత్యాచార కేసులో జీవిత ఖైదు శిక్ష పడిన కుల్​దీప్​ సెంగార్​ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన జీవిత ఖైదును సవాలు చేస్తూ వ్యాజ్యం దాఖలు చేశాడు.

అయితే అతడి అప్పీలుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది న్యాయస్థానం. నిబంధనల మేరకు అన్ని అవాంతరాలను అధగమిస్తేనే విచారణకు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.

2019 డిసెంబర్ 16న ట్రయల్​ కోర్టు తీర్పును కొట్టివేయాలని, డిసెంబర్ 20న బతికి ఉన్నంత కాలం జైలులోనే ఉండాలని పేర్కొంటూ ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని కోరాడు సెంగార్​.

జీవిత ఖైదు..

అత్యాచారం, అధికార దుర్వినియోగం అభియోగాల కింద సెం​గార్​కు జీవిత ఖైదు, రూ. 25 లక్షల జరిమానా విధిస్తూ డిసెంబర్​ 20న తీర్పు ఇచ్చింది కోర్టు. 2017లో జరిగిన ఘటన కారణంగా ఆ తర్వాత చేసిన పోక్సో చట్ట సవరణను అనుసరించి మరణ శిక్ష విధించలేమని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి: నిర్భయ దోషుల 'ఉరి'పై రాష్ట్రపతి నిర్ణయమే కీలకం!

ABOUT THE AUTHOR

...view details