తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్ బాధితురాలి తండ్రి హత్య కేసులో తీర్పు 4న - BJP leader

ఉన్నావ్ అత్యాచార కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నాడు దోషిగా తేలిన భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్ సెంగార్. అయితే బాధితురాలి తండ్రి హత్య కేసుపై దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. సీబీఐ సమర్పించిన ఆధారాలను స్వీకరించిన కోర్టు.. తీర్పును మార్చి 4వ తేదికి వాయిదా వేసింది.

unnav
ఉన్నావ్: మార్చి 4న బాధితురాలి తండ్రి హత్య కేసులో తీర్పు

By

Published : Feb 29, 2020, 10:08 PM IST

Updated : Mar 3, 2020, 12:15 AM IST

ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో తీర్పును మార్చి 4వ తేదికి వాయిదా వేసింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన భాజపా బ‌హిష్కృత ఎమ్మెల్యే కుల్​దీప్ సెంగార్‌ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

ఇప్పటికే ఉన్నావ్​ అత్యాచార కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సెంగార్‌.. బాధితురాలి తండ్రి హత్య కేసులోనూ నిందితుని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2018లో పోలీస్ కస్టడిలో బాధితురాలి తండ్రి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆయన మృతి వెనుక సెంగార్‌ హస్తం ఉందని సీబీఐ బలమైన సాక్ష్యాలను కోర్టు ముందు ప్రవేశ పెట్టింది. 55 మంది సాక్షులను కోర్టు ఎదుట హాజరుపరచింది. అత్యాచార బాధితురాలి మామ, తల్లి వాంగ్మూలాలు రికార్డు చేసి న్యాయస్థానానికి సమర్పించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును బుధవారానికి వాయిదా వేసింది.

ఇదీ చూడండి:డెత్​ వారెంట్​పై స్టే కోరుతూ 'నిర్భయ' దోషుల పిటిషన్​

Last Updated : Mar 3, 2020, 12:15 AM IST

ABOUT THE AUTHOR

...view details