తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భాజపా సర్కారు గద్దె దిగితేనే ప్రజలకు న్యాయం' - అఖిలేశ్​ యాదవ్​

ఉన్నావ్​ వంటి ఘటనలు భాజపా ప్రభుత్వంలో కొత్త ఏమీ కాదని విమర్శించారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్​. అత్యాచారాలకు పాల్పడిన నేరస్థులను కాల్చి పారేస్తామని ముఖ్యమంత్రి విధానసభ వేదికగా చెప్పినప్పటికీ.. ఒక యువతి ప్రాణాలు కాపాడలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నావ్​ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విధానసభ ముందు ధర్నాకు దిగారు అఖిలేశ్.

Akhilesh
'భాజపా సర్కారు గద్దె దిగితేనే ప్రజలకు న్యాయం'

By

Published : Dec 7, 2019, 1:44 PM IST

Updated : Dec 7, 2019, 3:10 PM IST

'భాజపా సర్కారు గద్దె దిగితేనే ప్రజలకు న్యాయం'

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలికి నిప్పు పెట్టి హతమార్చిన ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టింది ప్రతిపక్ష సమాజ్​వాదీ పార్టీ. లఖ్​నవూలోని విధానసభ ముందు భైఠాయించారు ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్​ యాదవ్​. భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఉన్నావ్​ బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన ఈ రోజును చీకటి రోజుగా అభివర్ణించారు అఖిలేశ్​. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రేపు ఉన్నావ్​ బాధితురాలికి నివాళిగా శోఖ సభలు నిర్వహిస్తామని తెలిపారు.

" ఉన్నావ్​ లాంటి ఘటనలు భారతీయ జనతా పార్టీ హయాంలో తొలిసారి కాదు. అపరాధులను కాల్చిపడేస్తామని ఈ విధానసభ వేదికగా ముఖ్యమంత్రి చెప్పారు. ఉత్తర్​ప్రదేశ్​లో నిందితులు తప్పించుకుని బయట తిరుగుతున్నారు. ఏ కారణం చేత దోషులు బయట ఉన్నారు. నిందితులను విడిచిపెట్టమని విధాన సభలో ముఖ్యమంత్రి ప్రతిజ్ఞ చేసినా.. ఒక యువతి ప్రాణాలు కాపాడలేకపోయారు. యూపీ ముఖ్యమంత్రి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీలు బాధ్యతల నుంచి తప్పుకోనంత వరకు రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగదు."

- అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడు.

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు.. నిందితులు నిప్పు పెట్టిన ఘటనలో 90 శాతం కాలిన గాయాలతో దిల్లీ సఫ్దార్​గంజ్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు.

ఇదీ చూడండి: 'ఉన్నావ్​ బాధితురాలికి రక్షణ ఎందుకు కల్పించలేదు?'

Last Updated : Dec 7, 2019, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details