తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఉన్నావ్'​ కేసులో పోలీసులకు లంచాలు..! - వీడియో

ఉత్తర్​ప్రదేశ్​లోని సీతాపూర్​ జైలు పోలీసు అధికారికి ఉన్నావ్​ పంచాయతీ సభ్యుడు రింకూ సింగ్​ లంచం ఇస్తున్న వీడియో కలకలం సృష్టిస్తోంది. ఉన్నావ్​ అత్యాచార నిందితుడు సెంగార్​​ ఉంటున్న జైలు అదే. సెంగార్​కు రింకూ సింగ్​ అత్యంత సన్నిహితుడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఉన్నావ్​ కేసులో పోలీసులకు లంచాలిచ్చే ప్రయత్నాలు!

By

Published : Aug 3, 2019, 6:08 AM IST

Updated : Aug 3, 2019, 8:19 AM IST

ఉన్నావ్​ కేసులకు సంబంధించిన ఓ వీడియో కలకలం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్​లో అత్యాచార నిందితుడు సెంగార్​​ ఉంటున్న సీతాపూర్​ జైలు బయట ఓ పోలీసు అధికారికి ఉన్నావ్​ పంచాయతీ సభ్యుడు రింకూ శుక్లా లంచం ఇస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది. సెంగార్​కు రింకూ శుక్లా అత్యంత సన్నిహితుడని సమాచారం.

ఈ పూర్తి వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఆరోపణలు రుజువైతే నిందితులపై కఠిన చర్యలు చేపడతామన్నారు.

'టీ కోసం డబ్బులిచ్చుంటా..'

వీడియోపై స్పందించిన రింకూ సింగ్​... సెన్​గర్​ను కలిసేందుకు డబ్బులు ఇవ్వలేదన్నాడు.

"అది నాకు అలవాటు. టీ తాగడం కోసం జైలు వద్ద ఉన్న పోలీసుకు డబ్బులు ఇచ్చి ఉంటా. అంతే కానీ సెంగార్​​ను కలవడానికి పోలీసుకు లంచం ఇవ్వలేదు. సెంగార్​ను 10-15 రోజుల ముందే కలిశా. ఆయన​ మా ఎమ్మెల్యే. అందుకే కలవడానికి వెళ్లా."
--- రింకూ సింగ్​, ఉన్నావ్​ పంచాయతీ సభ్యుడు.

రోడ్డు ప్రమాద ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) విచారణ చేపట్టింది. సెంగార్​​తో సహా 10 మందిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసింది.

ఇదీ చూడండి:- 'మేం హిందుస్థానీ.. మా వీధి పాకిస్థానీ'

Last Updated : Aug 3, 2019, 8:19 AM IST

ABOUT THE AUTHOR

...view details