దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం కీలక నిర్ణయం వెలువరించింది. ఈ కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ సహా దోషులందరికీ పదేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా కుల్దీప్ సింగ్, అతని సోదరుడు అతుల్ సెంగార్.. బాధిత కుటుంబానికి ఒక్కొక్కరు రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది.
ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగార్‌కు పదేళ్ల జైలు - దిల్లీ హైకోర్టు
ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య కేసులో భాజపా బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు పదేళ్ల జైలు శిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఇద్దరు దోషులు కలిసి.. బాధితురాలి కుటుంబానికి రూ.20లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఉన్నావ్ అత్యాచార కేసులో ఇప్పటికే జీవితఖైదు అనుభవిస్తున్నాడు సెంగార్.
ఉన్నావ్ కేసు: కుల్దీప్ సెంగార్‌కు మరో పదేళ్ల జైలు
2017లో ఓ మైనర్ బాలికను అపహరించి అత్యాచారం జరిపిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు సెంగార్. కేసు విచారణ సందర్భంగా.. బాధితురాలి తండ్రి 2018 ఏప్రిల్ 9న జ్యుడీషియల్ కస్టడీలో మరణించారు. ఆయన మృతి వెనుక సెంగార్ హస్తం ఉందని సీబీఐ బలమైన సాక్ష్యాలను దిల్లీకోర్టు ఎదుట ప్రవేశ పెట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం సెంగార్‌కు ఈ కేసులో పదేళ్ల జైలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి:గూగుల్ ఉద్యోగికి కరోనా.. ఇంటి నుంచే పనిచేయాలని సూచన!