అక్టోబరు 15 తర్వాత పాఠశాలలను తెరిచేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర విద్యాశాఖ. దశల వారీగా స్కూళ్లు తెరవాలని స్పష్టం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని.. స్థానిక అవసరాల మేరకు ఎస్ఓపీ(స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)ను రూపొందించే అధికారాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అప్పజెప్పింది.
అయితే విద్యార్థుల హాజరుపై కొంత వెసులుబాటు కల్పించాలని విద్యాశాఖ పేర్కొంది. స్కూళ్లు తెరుచుకున్న 2-3 వారాల వరకు ఎలాంటి అసెస్మెంట్లు ఉండకూడదని స్పష్టం చేసింది.