తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అన్​లాక్​-1 ఇచ్చే స్వేచ్ఛను జాగ్రత్తగా ఉపయోగించుకోండి' - అన్​లాక్

లాక్​డౌన్​ ఆంక్షలను దశలవారీగా సడలించనున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు ఇచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. సోమవారం నుంచి లాక్​డౌన్ ఆంక్షల పరిధిలోకి వచ్చేవారు చాలా తక్కువ మందే ఉంటారని పేర్కొన్నారు.

venkaiah naidu
వెంకయ్యనాయుడు

By

Published : Jun 1, 2020, 6:01 AM IST

దేశవ్యాప్తంగా జూన్ 8 నుంచి కేంద్రం మరిన్ని లాక్​డౌన్ మినహాయింపులు ఇవ్వనున్న నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. లాక్​డౌన్ ప్రభావం ఎదుర్కొన్న సమాజం ఒక్కసారిగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తుందని... అందువల్ల పౌరులందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఈ మేరకు 'అన్​లాక్-1: హ్యాండిల్ విత్ కేర్' పేరిట ఫేస్​బుక్​ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు వెంకయ్య. సడలింపుల తర్వాత లభించే స్వేచ్ఛను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

లాక్​డౌన్​ 4లో ఇచ్చిన సడలింపుల కారణంగా కేసులు గరిష్ఠ స్థాయిలో నమోదైన విషయాన్ని వెంకయ్య గుర్తు చేశారు. మే 18నుంచి దాదాపు ప్రతి రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు గుర్తించినట్లు చెప్పారు. మే 30న దాదాపు 8 వేల కేసులు బయటపడిన విషయాన్ని ప్రస్తావించారు.

"దేశంలో లాక్​డౌన్​ను దశలవారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ విషయం(కేసులు పెరగడం) ఓ మార్గదర్శకాన్ని అందిస్తోంది. పునరుద్ధరణ కార్యక్రమాలకు విఘాతం కలగకుండా అన్​లాక్-1 ను జాగ్రత్తగా చేపట్టాలని సూచిస్తోంది."

-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

దేశవ్యాప్తంగా నిర్బంధం దాదాపుగా ఎత్తివేసినట్లేనని వెంకయ్య పేర్కొన్నారు. కేవలం కంటైన్​మెంట్​ జోన్లలోనే లాక్​డౌన్ కొనసాగుతుందని అన్నారు. దేశంలో ఉన్న 6 వేల కంటైన్​మెంట్ జోన్లన్నీ చాలా వరకు 13 నగరాల్లోనే ఉన్నాయని, 70 శాతానికిపైగా కేసులు ఈ ప్రాంతాల్లోనే ఉన్నాయని తెలిపారు. సోమవారం నుంచి ఆంక్షల పరిధిలోకి వచ్చే వారు చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటారని పేర్కొన్నారు.

కరోనాతో పోరులో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలను ప్రశంసించారు వెంకయ్య. కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో మంచి ఫలితాలు రాబట్టినట్లు తెలిపారు. ఇప్పుడు అన్​లాక్​-1ని సైతం జాగ్రత్తగా అమలు చేయాలని రాష్ట్రాలకు సూచించారు.

ఇదీ చదవండి:పిడుగుల ధాటికి దెబ్బతిన్న తాజ్​మహల్ ప్రాంగణం​!

ABOUT THE AUTHOR

...view details