'ఫిట్ ఇండియా ప్లాగ్ రన్' దేశవ్యాప్తంగా ఉత్సాహంగా సాగింది. ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు ప్రధాన నగరాల్లో ప్రజలు ఉదయాన్నే జాగింగ్ చేస్తూ, రోడ్డుపై కనిపించిన ప్లాస్టిక్‌ను ఏరేశారు.
దిల్లీలో ప్లాగ్ రన్‌ను కేంద్ర క్రీడల శాఖమంత్రి కిరణ్ రిజుజు జెండా ఊపి ప్రారంభించారు. రెజ్లర్ భజ్రంగ్ పునియా సహా మరికొందరు క్రీడా ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
"నేనొక ఎయిర్ పిస్టల్ షూటర్‌ను. ఫిట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఇక్కడికి వచ్చాను. మహాత్మాగాంధీ 150 జయంతి సందర్భంగా నిర్దేశించుకున్న ఈ ఫిట్ ఇడియా- క్లీన్ ఇండియా లక్ష్యం బాగుంది. ఈ కారణంగానే ఇందులో భాగం కావాలని వచ్చాను."