కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ మంత్రి వర్గంలోని ముగ్గురు కేంద్రమంత్రులు.. నవంబరు 13న నిరసనలు చేస్తున్న పంజాబ్ రైతులను కలువనున్నారు. వీరిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌లు ఉన్నారు.
పంజాబ్ రైతులను కలవనున్న కేంద్రమంత్రులు! - Farmers of Punjab protest against agri acts latest news
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతు నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి చర్చలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నవంబరు 13న ముగ్గురు కేంద్ర మంత్రులు అన్నదాతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. పంజాబ్‌పై కేంద్రం వివక్ష చూపుతుందన్న ఆరోపణల మధ్య ఈ భేటీ కీలకం కానుంది.
![పంజాబ్ రైతులను కలవనున్న కేంద్రమంత్రులు! Union Ministers to meet agitating farmers of Punjab: Sources](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9490354-907-9490354-1604932103235.jpg)
నవంబరు 13న పంజాబ్ రైతులను కలవనున్న కేంద్రమంత్రులు!
ఈ కార్యక్రమం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వగృహంలో జరగనుంది. పంజాబ్‌లోని భాజపా కార్యకర్తలు, రైతులు ఇందులో పాల్గొననున్నారు.
TAGGED:
punjab farmers latest newws