తెలంగాణ

telangana

ETV Bharat / bharat

14 ఖరీఫ్​ పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర - Union Cabinet's decisions latest news

Union Cabinet's decisions
కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు

By

Published : Jun 1, 2020, 4:18 PM IST

Updated : Jun 1, 2020, 5:34 PM IST

17:33 June 01

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్​ఎంఈ)లకు ఊతమిచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్రం. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఇప్పటికే 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. పేదల అభ్యున్నతికే కేంద్రం అధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు.

మద్దతు ధర

రైతులకు ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇవ్వాలని కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా వచ్చే ఖరీఫ్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధర ఇస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ ప్రకటించారు. రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే కిసాన్​ క్రెడిట్​ కార్డు పథకం, పెట్టుబడి సాయం వంటి అనేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

  • వచ్చే ఖరీస్​ సీజన్​ నుంచి 14 రకాల పంటలకు ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర
  • కనీస మద్దతు ధర 50-83 శాతం పెంపు
  • రైతులు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు
  • వరికి 2020-21 పంటకాలానికి కనీస మద్దతు ధర రూ. 53 పెంపు. క్వింటా ధాన్యం రూ.1,868కి చేరిక.
  • పత్తి క్వింటాకు రూ. 260 కనీస మద్దతు ధర పెంపు. రూ. 5,515కు చేరిన క్వింటా ధర.
  • రాగులు, వేరుశెనగ, సోయా, పత్తి, పెసర పంటలకు మద్దతు ధర 50 శాతం పెంపు.
  • క్వింటా రాగులు రూ. 2620కి చేరిక

ఈక్విటీ పెట్టుబడులు

కేబినెట్​ భేటీలో చారిత్రక నిర్ణయాలు తీసుకున్నామన్నారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఎంఎస్​ఎంఈలది కీలక పాత్రగా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 6 వేలకుపైగా ఎంఎస్​ఎంఈలకు రూ. 50వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న సంస్థలకు రూ. 20వేల కోట్ల ప్యాకేజీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్య తరహా పరిశ్రమల టర్నోవర్​ పరిమితి రూ. 250 కోట్లకు, పెట్టుబడుల పరిమితి రూ. 50కోట్లకు పెంచినట్లు చెప్పారు.

వీధి వ్యాపారులకు రుణ పథకం..

వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​. రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

16:24 June 01

రైతులకు మద్దతుధర

రైతులకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ మద్దతుధర ఇవ్వాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతుధర ఇస్తున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​​. 20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు వేశామని, 50 లక్షల మంది వీధివ్యాపారులకు లబ్ధి చేకూర్చామని గుర్తు చేశారు.

16:13 June 01

కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలు

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరిస్తున్నారు కేంద్ర మంత్రులు ప్రకాశ్​ జావడేకర్, నితిన్ గడ్కరీ, నరేంద్ర సింగ్ తోమర్​.

  • రైతులు, ఎంఎస్‌ఎంఈల విషయమై కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు
  • దేశంలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర
  • దేశవ్యాప్తంగా 6 కోట్లకు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయి
  • ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మరింత విస్తరించాం
  • ఎంఎస్‌ఎఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు
  • రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం
  • పేదప్రజల సంక్షేమమే మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
  • లాక్‌డౌన్ విధించిన వెంటనే పేదలకు ఆర్థిక సాయం చేశాం
  • రైతుల కోసం కిసాన్‌ క్రెడిట్‌ కార్డు పథకం
Last Updated : Jun 1, 2020, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details