దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఎన్డీఏ పక్షనేతలు సమావేశమయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.
సార్వత్రిక ఎన్నికలు జరిగిన తీరు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ఈ నెల 23న ఓట్ల లెక్కింపు సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించనున్నట్లు సమాచారం.