రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నివిధాలుగా ప్రయత్నించారని ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు షెకావత్ ప్రయత్నించి అడ్డంగా దొరికిపోయారని ఎద్దేవా చేశారు.
తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు భాజపా తరుఫున ఫోన్‌లో మాట్లాడింది షెకావతేనని గహ్లోత్ ఆరోపించారు. కేంద్రమంత్రి ఏ నేరం చేయకపోతే వాయిస్ శాంపిల్ ఇవ్వడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.