కేంద్ర మంత్రి, భాజపా నేత సురేశ్ అంగాడి కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న ఆయన దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. సురేశ్.. ప్రస్తుతం రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆయన కర్ణాటకలోని బెల్గాం స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వరుసగా నాలుగుసార్లు(2004,09,14,19) పార్లమెంటుకు ఎంపికయ్యారు.
సెప్టెంబర్ 11న కరోనా సోకినట్లు ట్వీట్ చేశారు సురేశ్.
ప్రముఖుల దిగ్భ్రాంతి..