'గో కరోనా.. గో' ఉపదేశంతో దేశమంతా వార్తల్లోకెక్కిన కేంద్ర సామాజికన్యాయ శాఖ సహాయమంత్రి రాందాస్ అఠవాలే(60)కు మంగళవారం కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం దక్షిణ ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు.
కేంద్రమంత్రి అఠవాలేకు కరోనా పాజిటివ్
కేంద్ర మంత్రి రాందాస్ అఠవాలేకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ముంబయిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు షుగర్ వ్యాధి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రాజ్యసభ సభ్యుడైన అరవాలేకు చక్కెరవ్యాధి కూడా ఉన్నట్టు ఆయన సహాయకుడు తెలిపారు. సినీనటి పాయల్ ఘోష్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిన సందర్భంగా సోమవారం ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ) నాయకుడైన అఠవాలే.. చైనా ప్రతినిధి, బౌద్ధ సన్యా సులతో కలిసి పాల్గొన్న ఓ ప్రార్థన సమావేశపు వీడియో బాగా వైరల్ అయింది. గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద చిత్రీకరించిన ఆ వీడియోలో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు 'గో కరోనా.. గో కరోనా' అంటూ అఠవాలేతో పాటు అందరూ కేకలు పెడతారు.