మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ.. శివసేనను ఆహ్వానించిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయంతో ఎన్డీఏ కూటమి నుంచిశివసేన బయటకొచ్చేసినట్టేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
కేంద్ర మంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా! - shiv sena latest news
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనను గవర్నర్ ఆహ్వానించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు శివసేన ఎంపీ అరవింద్ సావంత్. నేడు ఉదయం 11 గంటలకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు.
కేంద్ర మంత్రి పదవికి అరవింద్ సావంత్ రాజీనామా!
ప్రభుత్వ ఏర్పాటులో శివసేనకు మద్దతు ఇవ్వాలంటే ముందుగా ఎన్డీఏ కూటమి నుంచి ఆ పార్టీ తప్పుకోవాలని స్పష్టం చేసింది ఎన్సీపీ. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని అన్ని పదవులకూ సేన నాయకులు రాజీనామా చేయాలని పేర్కొంది. ఎన్సీపీ తాజా ప్రతిపాదనకు శివసేన కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అరవింద్ సావంత్ రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: శివసేన కోర్టులోనే 'మహా' బంతి