మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్ - కొవిడ్ వార్తలు
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
19:18 August 04
మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
కేంద్ర మంత్రులు వరుసగా కరోనా బారినపడుతున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సోమవారం కరోనా సోకింది. తాజాగా .. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా సోకింది. ఆయనే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. దిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు.
ఇటీవల ఆయన సిబ్బందిలో కొందరికి వైరస్ సోకిన అనంతరం.. ధర్మేంద్ర ప్రధాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.
Last Updated : Aug 4, 2020, 7:45 PM IST