రఫేల్ ఒప్పందంలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని అన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. న్యాయ వ్యవస్థను, ప్రభుత్వ సంస్థలను నమ్మని రాహుల్ గాంధీ... పాకిస్థాన్‌ను విశ్వసించాలని అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. రఫేల్ ఒప్పందం దేశ భద్రత కోసమేనని మరోసారి స్పష్టం చేశారు.
'రాహుల్ దేన్నీ నమ్మరు' - రవి శంకర్
రాహుల్ గాంధీ ప్రభుత్వ సంస్థలను విశ్వసించడం లేదని ఆరోపించారు కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్. రఫేల్ ఒప్పందంపై రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు.
'రాహుల్ దేన్నీ నమ్మరు'
"అబద్ధాలు చెప్పడం రాహుల్‌కు అలవాటుగా మారింది. వైమానిక దళాన్ని నమ్మరు. సుప్రీంకోర్టును నమ్మరు, కాగ్‌ను నమ్మరు. మరి పాకిస్థాన్‌ను విశ్వసించాలనుకుంటున్నారేమో.."
-- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర మంత్రి
Last Updated : Mar 7, 2019, 7:13 PM IST