ఆరోగ్య సమస్యలతో దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. త్వరలోనే డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు.
పూర్తిగా కోలుకున్న అమిత్ షా.. త్వరలోనే డిశ్చార్జి - అమిత్ షా తాజా వార్తలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తిగా కోలుకున్నారని దిల్లీ ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఆరోగ్య సమస్యలతో ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేరారు షా.
![పూర్తిగా కోలుకున్న అమిత్ షా.. త్వరలోనే డిశ్చార్జి SHAH-AIIMS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8605680-565-8605680-1598701975686.jpg)
అమిత్ షా
అమిత్ షాకు ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకున్న షా.. డిశ్చార్జి అయ్యారు. ఆగస్టు 18న ఒళ్లు నొప్పుల కారణంగా దిల్లీ ఎయిమ్స్‌లో చేరారు.
ఇదీ చూడండి:శ్వాసకోశ సమస్యతో ఎయిమ్స్‌లో చేరిన అమిత్ షా
Last Updated : Aug 29, 2020, 7:13 PM IST