వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై రాష్ట్రాల అధికారులతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా భేటీ అయ్యారు. టీకా పంపిణీ ఏర్పాట్లను సమీక్షించారు. ప్రాధాన్య జాబితాలో ఉండే వ్యక్తుల పేర్లతో డేటాబేస్ తయారు చేయాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, హోంగార్డులు, అగ్నిమాపక దళాలు, వైద్య సేవల సిబ్బంది పేర్లతో ఈ డేటాబేస్ను రూపొందించాలని పేర్కొన్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల డీజీపీలు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అత్యవసర వినియోగానికి మూడు టీకా తయారీ సంస్థలు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నేపథ్యంలో ఈ కీలక సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.