తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సిన్​ సరఫరాపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

కరోనా వ్యాక్సిన్​ సరఫరా, నిల్వ, భద్రతపై అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా లేఖ రాశారు. వివిధ అంశాల్లో కేంద్రానికి సహకరించి, కలిసి పనిచేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

Union Home Secretary writes to State Chief Secretaries for support in covid vaccine supple and storage
వ్యాక్సిన్​ సరఫరాపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ

By

Published : Dec 29, 2020, 5:40 AM IST

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా లేఖ రాశారు. కొవిడ్​ డేటాబేస్​ రూపకల్పన సహా తదితర అంశాల్లో ఆరోగ్య శాఖకు సహకరించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

వ్యాక్సిన్​ సరఫరా, నిల్వ, భద్రత అంశాల్లో కేంద్రంతో కలిసి పని చేయాలని... రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు అజయ్​ భల్లా. లబ్ధిదారులకు వ్యాక్సిన్​ పంపిణీ విషయంలోనూ ప్రణాళిక రూపొందించి సహకరించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం... పలు ఫార్మా సంస్థలు.. తమ కరోనా టీకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. అయితే టీకా ఆమోదం విషయంలో కేంద్ర జాగ్రత్త వహిస్తోంది. అన్ని విషయాలను పరిశీలిస్తోంది. వచ్చే నెలలో వివిధ టీకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించే అవకాశముంది.

ఇదీ చూడండి:-'5 కోట్ల కొవిషీల్డ్ టీకాలు సిద్ధం- అనుమతి రాగానే పంపిణీ'

ABOUT THE AUTHOR

...view details