తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై నేడు హోంశాఖ అత్యున్నత సమావేశం

కేంద్ర హోంమంత్రి అమిత్​షా జమ్ము కశ్మీర్​ పరిస్థితులపై నేడు అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులు, సమాచార వ్యవస్థ పునరుద్ధరణ సహా పలు అంశాలను ఆయన పరిశీలిస్తారు.

కశ్మీర్​పై నేడు హోంశాఖ అత్యున్నత సమావేశం

By

Published : Aug 27, 2019, 10:46 AM IST

Updated : Sep 28, 2019, 10:39 AM IST

జమ్ము కశ్మీర్​ పరిస్థితులపై నేడు కేంద్ర హోంమంత్రి అమిత్​షా అత్యున్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆర్టికల్​ 370 రద్దు తరువాత కశ్మీర్​లో నెలకొన్న పరిస్థితులు, సమాచార వ్యవస్థ పునరుద్ధరణపై ఆయన సమీక్ష చేస్తారు. సాధారణ జనజీవనం సాఫీగా కొనసాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చిస్తారు.

పాకిస్థాన్ అక్రమ చొరబాట్లను, ఉగ్రవాద ప్రేరేపిత చర్యలను అరికట్టడం సహా పలు అంశాలపై అధికారులతో అమిత్​షా చర్చిస్తారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్​, హోంశాఖ, ఐబీ అధికారులు, సరిహద్దు భద్రతా దళం, సీఆర్పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​ డీజీలు పాల్గొననున్నారు.

ఇదీ చూడండి: జీ-7: విజయంతో సగర్వంగా.. స్వదేశానికి మోదీ

Last Updated : Sep 28, 2019, 10:39 AM IST

ABOUT THE AUTHOR

...view details