తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్ చేరుకున్న అమిత్ షా- 2 రోజుల పర్యటన - అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటన

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్​కతా​కు చేరుకున్నారు. రెండు రోజుల పాటు బంగాల్​లో పర్యటించనున్నారు. రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే హోంమంత్రి వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. టీఎంసీ నేతల చేరికలే లక్ష్యంగా ఈ పర్యటన చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

amit shah in bengal
బంగాల్ చేరుకున్న అమిత్ షా- 2 రోజుల పర్యటన

By

Published : Dec 19, 2020, 5:37 AM IST

రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం రాత్రి బంగాల్​కు చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో అంసతృప్త నేతల రాజీనామాల పర్వం కొనసాగుతున్న క్రమంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర వ్యవహారాలపై సమీక్షించేందుకే హోంమంత్రి వస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. టీఎంసీ నేతల చేరికలే లక్ష్యంగా ఈ పర్యటన చేపడుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

"కోల్​కతాకు చేరుకున్నాను. గురుదేవ్ (రవీంద్రనాథ్)ఠాగూర్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, శ్యామా ప్రసాద్ ముఖర్జీ వంటి గొప్ప నేతలు వెలుగొందిన ఈ పవిత్ర నేలకు నమస్కరిస్తున్నాను."

-అమిత్ షా ట్వీట్

అసెంబ్లీ ఎన్నికల ముందు బంగాల్​ అధికార తృణమూల్​ కాంగ్రెస్​లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే.. పలువురు కీలక నేతలు పార్టీకి స్వస్తి పలికారు. టీఎంసీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్​ నేత సువేందు అధికారి.. అమిత్​ షా పర్యటన సందర్భంగానే కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. ఆయనతో పాటు శిలభద్ర దత్తా, జితేంద్ర తివారీ, బనాసరి మైతీ వంటి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. వీరితో పాటు అసంతృప్త టీఎంసీ నాయకులూ కమలదళంలో చేరతారని సమాచారం.

ఇదీ చదవండి:బంగాల్​కు అమిత్​ షా- చేరికలే లక్ష్యమా?

ABOUT THE AUTHOR

...view details