కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా - who was undergoing treatment for coronavirus
17:08 August 14
కరోనాను జయించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వైద్యుల సలహా మేరకు మరికొన్ని రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. దేవుడి దయతోనే కోలుకున్నానని పేర్కొన్నారు. తాను ఆరోగ్యంగా ఉండాలని కోరిన ప్రతి ఒక్కరికీ, చికిత్స అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు షా.
ఈ నెల 2న తనకు కరోనా సోకినట్లు అమిత్‌షా స్వయంగా వెల్లడించారు. వైద్యుల సూచన మేరకు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చిందంటూ ఈ నెల 9న ఆ పార్టీ ఎంపీ మనోజ్ తివారీ ట్వీట్ చేయగా.. ఆయనకు ఎలాంటి పరీక్షలూ నిర్వహించలేదని హోంశాఖ వర్గాలు ఖండించాయి.