కొవిడ్ మహమ్మారికి సామాన్యులే కాకుండా పలువురు మంత్రులు, ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యుల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరనున్నారు. కొవిడ్ ప్రాథమిక లక్షణాలు కనిపించడం వల్ల పరీక్షలు చేయించకున్నట్లు అమిత్ షా తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ట్వీట్ చేశారు.
కరోనా పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొద్దిరోజులుగా నన్ను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకొని.. ఐసోలేషన్‌లో ఉండాలి.