గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన ఘర్షణల్లో గాయపడిన పోలీసులను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం పరామర్శించారు. వారి ఆరోగ్య స్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
సివిల్స్ లైన్స్ ప్రాంతంలోని సుశ్రుతా ట్రామా సెంటర్, తిరథ్ రామ్ షా ఆస్పత్రులలో పోలీసులు చికిత్స పొందుతున్నారు.
జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఈ క్రమంలో సుమారు 400 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. రైతుల వైఖరి పట్ల దిల్లీ పోలీస్ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం పేర్కొంది.
ఇదీ చదవండి :ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య