తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జోరుగా 'ఆపరేషన్​ ఉత్తరాఖండ్'​: షా - ఉత్తరాఖండ్​ విపత్తు

ఉత్తరాఖండ్​ విపత్తుపై రాజ్యసభలో ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ప్రస్తుతం వరద ముప్పు తొలిగిపోయిందని తెలిపారు. ఐటీబీపీ, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు.

Union Home Minister Amit Shah
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

By

Published : Feb 9, 2021, 1:45 PM IST

Updated : Feb 9, 2021, 3:42 PM IST

ఉత్తరాఖండ్​ విపత్తులో 197 మంది వరకు గల్లంతయ్యారని, వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రాజ్యసభలో ప్రకటించారు. ఎన్​టీపీసీ ప్రాజెక్ట్​కు సంబంధించిన ఓ సొరంగంలో 25-35 మంది వరకు చిక్కుకున్నట్లు సమాచారం ఉందన్నారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

"ఉత్తరాఖండ్​లో సంభవించిన పెనువిపత్తులో గల్లంతైన 197 మంది కోసం గాలిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఎన్​టీపీసీ ప్రాజెక్ట్​లో 139 మంది, రిషి గంగా ప్రాజెక్ట్​ వద్ద 46 మంది కార్మికులు గల్లంతైనట్లు సమాచారం. మరో 12 మంది స్థానికులని అధికారులు గుర్తించారు. వీరి కోసం సహాయక సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.

450 మంది ఐటీబీపీ జవాన్లు, 5 బృందాల ఎన్​డీఆర్​ఎఫ్​, 8 బృందాల ఆర్మీ జవాన్లు, ఒక నౌకాదళ బృందం, 5 ఐఏఎఫ్​ హెలికాప్టర్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రస్తుతం నీటి మట్టం తగ్గిందని, దిగువ ప్రాంతాల్లో వరద ముప్పు తొలిగిపోయిందని ఉత్తరాఖండ్​ ప్రభుత్వం ప్రకటించింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ జరిగింది. ధ్వంసమైన 5 వంతెనలకు బీఆర్​ఓ మరమ్మతులు చేస్తోంది."

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

2020-21 వార్షిక సంవత్సరంలో రూ.1041 కోట్లు.. విపత్తు నిర్వహణ సహాయం కింద ఉత్తరాఖండ్​కు కేటాయించినట్లు అమిత్​ షా ప్రకటించారు. ఇందులో తొలి దఫాగా రూ.468 కోట్లు ఇప్పటికే రాష్ట్రానికి విడుదల చేసినట్లు తెలిపారు.

రాజ్యసభ సంతాపం

ఉత్తరాఖండ్​ విలయంలో ప్రాణాలు కోల్పోయిన వారిక ఆత్మలకు శాంతి చేకూరాలని రాజ్యసభ సభ్యులు కాసేపు మౌనం పాటించారు.

ఇదీ చూడండి:ఉత్తరాఖండ్ జలప్రళయం: 31కి చేరిన మృతులు

Last Updated : Feb 9, 2021, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details