తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అప్పటివరకు ప్లాస్మా థెరపీ వద్దు: కేంద్రం

కరోనా చికిత్సకు ఉపయోగిస్తున్న ప్లాస్మా థెరపీ.. ఇంకా ప్రయోగదశలోనే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పద్ధతి కొవిడ్​ చికిత్సకు ఉపయోగపడుతుందని ఎలాంటి ఆధారాల్లేవని వెల్లడించింది. కొవిడ్​ బాధితుల్లో ఇప్పటివరకు 23.3 శాతం కోలుకున్నట్లు పేర్కొన్నారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​. 24 గంటల్లో 684 మంది కోలుకున్నట్లు తెలిపారు.

Union Health Ministry briefs the media over #Coronavirus
అప్పటివరకు ప్లాస్మా థెరపీ వద్దు: కేంద్రం

By

Published : Apr 28, 2020, 5:02 PM IST

దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 684 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు స్పష్టం చేసింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 23.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్​ అగర్వాల్​.

ప్లాస్మా చికిత్సపై..

ప్రస్తుతం కొవిడ్​ చికిత్సలో ఉపయోగిస్తున్న ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉందన్న అగర్వాల్​.. ఈ పద్ధతి కరోనా నివారణకు ఉపయోగపడుతుందని ఎలాంటి ఆధారాల్లేవన్నారు. జాతీయ స్థాయిలో ఐసీఎంఆర్​ దీనిపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆమోదం పొందేవరకు ప్లాస్మా పద్ధతిని వాడొద్దని స్పష్టం చేశారు.

ట్రయల్ పద్ధతిలో లేదా పరిశోధనల కోసమే వినియోగించాలని పేర్కొన్నారు.​ ప్లాస్మా చికిత్సను సరైన పద్ధతిలో వాడకపోతే రోగి ప్రాణానికే ప్రమాదమని తెలిపారు.

అక్కడ కేసుల్లేవ్​...

గత 28 రోజులుగా 17 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదుకాలేదని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.

కరోనా వ్యాప్తి దృష్ట్యా దేశవ్యాప్తంగా కేంద్ర బృందాలు పర్యటిస్తున్నట్లు హోం శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీవాత్సవ పేర్కొన్నారు. సూరత్​లో విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అక్కడ ఇంటింటి సర్వేలు చేసి కేసులు గుర్తించినట్లు తెలిపిన ఆమె... కాంటాక్ట్​ కేసుల జాడ కనుగొనేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details