తుపాను తీవ్రత దృష్ట్యా 3 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో(సీఎస్).. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని విపత్తు సంక్షోభ నిర్వహణ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి సీఎస్‌లు ఈ భేటీకి హాజరయ్యారు. ముందస్తు చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
తుఫాను కదలికలు, ఎంత ప్రభావం చూపుతుంది వంటి వివరాలతో ఐఎండీ డీజీ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు గౌబా. తుపాను ప్రభావం నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
అన్ని విధాల సహాయ చర్యలకు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎస్‌లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్డీఆర్ఎఫ్)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.