ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం బుధవారం భేటీ కానుంది. 7 లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం జరగనున్నట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే మంత్రివర్గం రెండో సారి భేటీ కావడం గమనార్హం.
మంత్రివర్గ సమావేశంలో ఆర్థిక రంగానికి సంబంధించి మరిన్ని అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కొవిడ్ సంక్షోభం ఎదుర్కొంటున్న రంగాలకు మేలు కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.