ప్రభుత్వ రంగ సంస్ధలకు మరింత నగదు అందుబాటులో ఉంచేందుకు భారత్ బాండ్ ఈటీఎప్ పథకాన్ని ప్రారంభించేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం - కేంద్ర కేబినెట్
13:17 December 04
ఈటీఎఫ్ బాండ్లకు ఆమోదం...
13:08 December 04
ముఖ్య నిర్ణయాలు...
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఎస్సీ/ఎస్టీల సంక్షేమం కోసం చట్టసభల్లో వారి రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించాలని నిర్ణయించింది. వీటితో పాటు వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లునూ ఆమోదించింది కేంద్రం.
దిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్. ఈ బిల్లులన్నీ ఈ శీతకాల సమావేశంలోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్రం నిర్ణయించినట్టు తెలిపారు జావడేకర్. దీనితో పాటు దిల్లీలోని ప్రగతి మైదానంలోని 3.7 ఏకరాల భూమిని లీజుకిస్తున్నట్టు తెలిపారు. ఆ స్థలంలో 5 నక్షత్రాల హొటల్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు.
12:43 December 04
ఈ సమావేశాల్లోనే బిల్లులు...
పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ప్రకాశ్ జావడేకర్ ప్రకటించారు. కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు, వ్యక్తిగత సమాచార భద్రత బిల్లునూ ఆమోదించినట్టు వెల్లడించారు. జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ ఉపసంహరణ సవరణ బిల్లు ఆమోదించాలని కేబినెట్ నిర్ణయించినట్టు స్పష్టం చేశారు.
ఈ బిల్లులన్నీ ప్రస్తుత శీతకాల సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానున్నట్టు స్పష్టం చేశారు కేంద్రమంత్రి.
11:41 December 04
చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగింపు
సోమవారం జరిగిన కేంద్రమంత్రివర్గం సమావేశంలో జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం.
పౌరసత్వ సవరణ బిల్లుతో పాటు చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రివర్గం. రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించింది. లోక్‌సభతో పాటు, శాసనసభల్లో ఈ రిజర్వేషన్ల వర్తించనున్నాయి. 2020 జనవరి 25తో ప్రస్తుత రిజర్వేషన్ల గడువు ముగియనుంది.
11:25 December 04
జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
- జాతీయ పౌరసత్వ చట్ట సవరణ బిల్లుకు కేంద్రమంత్రివర్గం ఆమోదం
- శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెట్టనున్న కేంద్రం