రైల్వే బోర్డు పునర్నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది మంది సభ్యులతో కూడిన బోర్డును ఛైర్ పర్సన్‌తో కలిపి ఐదుగురికి కుదించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
సీడీఎస్, ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా - Union Cabinet Approves National Population Register

15:29 December 24
రైల్వే బోర్డు పునర్నిర్మాణంపై కేంద్రం కీలక నిర్ణయం
15:16 December 24
'సీడీఎస్' ఏర్పాటుకు కేంద్రం ఆమోదం
చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) పదవి ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. (సీడీఎస్) విధివిధానాలకు సంబంధించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ నేతృత్వంలోని బృందం సమర్పించిన నివేదికను కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతమున్న త్రివిధ దళాల అధిపతుల పేర్లను.. సీడీఎస్ కోసం పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం త్వరలో పదవీ విరమణ చేయనున్న ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్.. ఈ రేసులో ముందున్నట్టు తెలుస్తోంది. ఈనెల 31న సైన్యాధ్యక్షుడిగా రావత్ పదవీ విరమణ చేయనున్నారు.
14:53 December 24
సీడీఎస్, ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా
'జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్- ఎన్‌పీఆర్)'కు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ రూ.8500 కోట్లను కేటాయించినట్లు తెలుస్తోంది.