తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్ బలగాలు లక్ష్యంగా ఉగ్రవాదుల కాల్పులు - attack on crpf forces

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్​పీఎఫ్ బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ద్రాబ్​గమ్​లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద గస్తీ నిర్వహిస్తున్న బృందంపై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.

సీఆర్​పీఎఫ్ లక్ష్యంగా ముష్కరుల కాల్పులు

By

Published : Oct 29, 2019, 5:18 PM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో సీఆర్​పీఎఫ్ బలగాలు లక్ష్యంగా గుర్తుతెలియని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ద్రాబ్​గమ్​లోని ఓ పరీక్షా కేంద్రం వద్ద గస్తీ నిర్వహిస్తున్న బృందంపై కాల్పులకు తెగబడ్డారు ముష్కరులు. భద్రతా సిబ్బందిపైకి 6-7 రౌండ్లు కాల్పులు జరపగా.. బలగాలు సైతం దీటు సమాధానమిచ్చాయని అధికారులు వెల్లడించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అదనపు బలగాలు ముష్కరుల కోసం గాలిస్తున్నాయి. కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: సౌదీ రాజధానిలో కీలక ప్రసంగం చేయనున్న మోదీ

ABOUT THE AUTHOR

...view details