తమిళనాడు కోయంబత్తూర్‌లోని నంజుందపురం బస్‌స్టాప్ సమీపంలో ఉన్న అన్నాదురై, ఎంజీఆర్ విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు తొడిగారు. ఆ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వాటిని తొలగించారు.
తమిళనాడులో మాజీ సీఎంల విగ్రహాలకు మాస్క్‌లు! - mask fine in Tamilnadu
తమిళనాడులో దివంగత నేతలు అన్నాదురై, ఎంజీఆర్ విగ్రహాలకు గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్‌లు తొడిగారు. ఇది గుర్తించిన ఆ ప్రాంత ప్రజలు విగ్రహాలకు ఉన్న ముసుగులను తొలగించారు.
తమిళనాడులో ముఖ్యమంత్రుల విగ్రహాలకు మాస్క్‌లు!
తమిళనాడులో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. అందులో భాగంగానే కొవిడ్-19 వ్యాప్తిని నివారించడానికి పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించింది రాష్ట్ర ప్రభుత్వం. మాస్క్ ధరించకపోతే వారికి జరిమానా విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.