రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగ సమస్యపై పోరాడతామని స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన 50 మంది యువతతో నిరుద్యోగం అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ప్రియాంక.. ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం అంశంలో యువత వెంటే కాంగ్రెస్ ఉంటుందని హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయ నియామక పరీక్షలో ఉత్తీర్ణులైన యువతీయువకులు ఈ సందర్భంగా.. తమ బాధలను ప్రియాంకకు చెప్పుకున్నారు. 2016లోనే ఉద్యోగానికి ఎంపికైనా.. ఇప్పటివరకు నియామక పత్రం ఇవ్వలేదని ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది. రెండేళ్లుగా కుంగుబాటుకు లోనయ్యాయని.. తన కుటుంబమూ ఇబ్బందుల్లో ఉందని కన్నీటి పర్యంతమైంది.
ట్యూషన్లు చెప్పి జీవనోపాధి పొందుతుంటే.. కరోనా సంక్షోభం మరింత చిక్కుల్లోకి నెట్టిందని కొందరు వాపోయారు.