తమిళనాడులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నకిలీ బ్రాంచ్ తెరిచిన ముగ్గురు మోసగాళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు.
కడలూర్ జిల్లా పన్రూటి గ్రామానికి చెందిన కమల్‌బాబు ఓ నిరుద్యోగి. తల్లిదండ్రులు మాజీ బ్యాంక్ ఉద్యోగులు. అమ్మానాన్నల్లాగా తానూ కష్టపడి బ్యాంకులో ఉద్యోగం చేయడమేంటీ, ఏకంగా బ్యాంకే తెరిచేస్తే పోలా అనుకున్నాడో ఏమో.. ఏకంగా నకిలీ బ్రాంచ్‌కే స్కెచ్ వేశాడు.
ఎస్బీఐ నకిలీ బ్రాంచ్ తెరిచిన ముగ్గురు మోసగాళ్లు అరెస్ట్! ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కుమార్, రబ్బర్ స్టాంప్ తయారీదారుడు మణిక్కం సాయంతో.. నకిలీ బ్యాంకు చలాన్లు, రబ్బర్ స్టాంపులు సృష్టించాడు కమల్. తరచూ బ్యాంకుకు వెళ్లి, బ్రాంచ్ ఏర్పాట్లల్లో ఉన్న వీరి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఎస్బీఐ జోనల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రాంచ్ ప్రారంభించి.. జనాల డబ్బులు నొక్కేయకముందే నిందితులను అరెస్ట్ చేశారు తమిళనాడు పోలీసులు.
ఇదీ చదవండి: భారత 'పులుల గణన'కు గిన్నిస్ రికార్డ్‌లో చోటు