దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు 40వ రోజు సాగుతున్నాయి. దేశ రాజధానిలో చలి తీవ్రతకు తోడు చెదురుమదురు వర్షాలు కురుస్తున్నప్పటికీ పట్టువీడని రైతులు.. నిరసనలు కొనసాగిస్తున్నారు. రానున్న రోజుల్లో మరింత ఉద్ధృతం చేస్తామని ఇప్పటికే కేంద్రానికి హెచ్చరించారు.
వర్షం, చలిని బేఖాతరు చేస్తూ రైతుల ఆందోళనలు - farmer unions and Government
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు 40వ రోజు కొనసాగుతున్నాయి. దిల్లీలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నప్పటికీ ఆందోళనలను మరింత ఉద్ధృతంగా సాగిస్తున్నారు కర్షకులు.
దిగజారుతున్న వాతావరణం- పట్టువీడని అన్నదాతలు
ఇప్పటివరకు రైతు సంఘాలు-కేంద్రానికి మధ్య ఏడుసార్లు చర్చలు జరిగినప్పటికీ ప్రతిష్టంభన వీడలేదు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబడితే.. వాటితో అన్నదాతలకు గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయని ప్రభుత్వం చెబుతోంది. ఈ నెల 8న మరో దఫా చర్చలు జరగనున్నాయి.