తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2020, 1:53 PM IST

ETV Bharat / bharat

ఆ రెండు యుద్ధాల్లో భారత్​దే గెలుపు.. కానీ..: షా

కరోనా సంక్షోభం, సరిహద్దు ఉద్రిక్తతలను రెండు యుద్ధాలుగా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి అమిత్​ షా.. వాటిలో కచ్చితంగా విజయం సాధించే సామర్థ్యం ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉందన్నారు. కానీ కాంగ్రెస్​ మాత్రం అన్నిటింలోనూ తప్పులు వెతుకుతోందని.. ఆ పార్టీ ప్రచారాలకు పాకిస్థాన్​, చైనా నుంచి మద్దతు లభిస్తోందని పరోక్ష విమర్శలు చేశారు.

Under PM Modi's leadership, India is going to win both the wars: Home Minister Amit Shah
'ఆ రెండు యుద్ధాల్లో భారత్​దే గెలుపు.. కానీ'

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం.. కరోనా సంక్షోభం, చైనాతో సరిహద్దు వివాదమనే యుద్ధాల్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా వెల్లడించారు. ఏఎన్​ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అమిత్​ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై పరోక్ష విమర్శలు చేశారు షా. ప్రతి విషయంలోనూ కొందరు తప్పులు వెతుకుతారని ఆరోపించారు.

"ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా. కరోనా సంక్షోభం, వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్​ కచ్చితంగా విజయం సాధిస్తుంది. కానీ కొందరు ప్రతి విషయాన్ని తప్పుగా చూస్తారు. దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రచారాలను మేము సమర్థవంతంగా అడ్డుకోగలం. కానీ ఓ పెద్ద పార్టీకి చెందిన మాజీ అధ్యక్షుడు (రాహుల్​ గాంధీ).. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లోనూ రాజకీయాలు చేయడం ఎంతో బాధాకరం. ఆ పార్టీ చేస్తున్న 'సరెండర్​ మోదీ' హ్యాష్​ట్యాగ్​కు పాకిస్థాన్​, చైనా మద్దతు పలుకుతున్నాయి. ఈ విషయంపై ఆయన, ఆయన పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి."

-- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

కరోనా వైరస్​ సంక్షోభం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదంలో మోదీ తీరుపై రాహుల్​ గాంధీ అనేకమార్లు విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే సరిహద్దులో ఏం జరుగుతోందో ప్రజలకు చెప్పాలని డిమాండ్​ చేశారు. మోదీ భయపడకుండా ప్రజల ముందుకొచ్చి.. నిజం చెప్పాలన్నారు రాహుల్​.

ఇదీ చూడండి:-పీవోకేలో చైనా విమానాలు.. భారత్​కు వ్యతిరేకంగా కుట్ర

ABOUT THE AUTHOR

...view details