ఐరాస 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో.. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాకిస్థాన్‌పై తీవ్రస్థాయిలో మండిపడింది భారత్. ఉగ్రవాదానికి అడ్డాగా పాక్ మారిందన్న విషయం ప్రపంచ దేశాలకు తెలుసని.. ఉగ్రవాదులను అమరులుగా ఆ దేశం అభివర్ణిస్తుందని విమర్శించింది.
కశ్మీర్‌పై పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చేసిన ప్రసంగాన్ని ఐరాసలోని భారత ప్రధాన కార్యదర్శి విదిష మైత్రా తప్పుబట్టారు. భారత అంతర్గత విషయమైన కశ్మీర్‌పై పాక్ ఎప్పుడూ కల్పిత కథలను చెబుతూనే ఉంటుందని తేల్చిచెప్పారు.