కార్గిల్ యుద్ధం, పుల్వామా ఉదంతంతో పాటు ఇతర ఉగ్రదాడుల్లో అమరవీరులైన జవాన్లకు నివాళిగా 'భారత యాత్ర'ను చేపట్టారు కర్ణాటక బెంగళూరుకు చెందిన ఉమేశ్ గోపినాథ్ జాదవ్. వృత్తిపరంగా సంగీతకారుడే అయినప్పటికీ.. గుండెల నిండా దేశభక్తి ఉండటం వల్ల ఈ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు జాదవ్.
నిజానికి ఇలా యాత్ర చేపట్టడం జాదవ్‌కు ఇది రెండోసారి. 2019 ఏప్రిల్ 9- 2020 ఏప్రిల్ 9 వరకు తొలి దశ భారత యాత్ర నిర్వహించారు జాదవ్. ఆ పర్యటనలో 65వేల కిలోమీటర్లు ప్రయాణించి.. 98మంది అమర వీరుల ఇళ్లను సందర్శించారు. సైనికుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి సమాధుల వద్ద ఉన్న మట్టిని సేకరించారు. ఈ దఫా యాత్రలోనూ మట్టిని సేకరిస్తానని వెల్లడించారు జాదవ్.
మట్టితో మ్యాప్..
అమర వీరుల సమాధుల వద్ద సేకరించిన మట్టితో.. జమ్ముకశ్మీర్‌లో నిర్మిస్తున్న సైనిక స్మారకంలో ఇండియా మ్యాప్‌ను రూపొందిస్తానని తెలిపారు జాదవ్. ఇదే కారణంగా యాత్ర చేపట్టినట్టు పేర్కొన్నారు.