భారత్లో కరోనా వైరస్ నియంత్రణకు ప్రాథమిక మార్గం సామాజిక దూరం పాటించడమేనని బ్రిటన్ రాజకీయవేత్త, భారతీయ వైద్యుడు నీరజ్ పాటిల్ పేర్కొన్నారు. ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బ్రిటన్ లో అనేక వ్యూహాలను అనుసరించి కరోనాను కట్టడి చేస్తున్నట్లు వివరించారు.
యూకేలో కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను వెలుగులోకి తెచ్చారు నీరజ్. కరోనాను కట్టడి చేసేందుకు మూడు దశల వ్యూహాన్ని బ్రిటన్ అమలు చేసిందని తెలిపారు.
నీరజ్ చెప్పిన కీలక విషయాలు:
- సామాజిక దూరాన్ని పకడ్బందీగా అమలు చేయటం, మహమ్మారిపై స్వీయ అవగాహన పెంచుకోవటం వల్ల బ్రిటన్ భారీ విజయం సాధించింది. చాలా పాజిటివ్ కేసులను కట్టడి చేయగలిగాం.
- మూడో నివారణ దశకు చేరేసరికి... 70 ఏళ్ల పైబడిన వారు, గర్భిణిలు, హృదయ, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారు 5 శాతమే ఉన్నారు. వారికి ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాం.
- బ్రిటన్ లో వ్యక్తిగత సంరక్షణ పరికరాల కొరత మినహా పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. కానీ... ఇదే అతిపెద్ద వైఫల్యంగా మారింది.
- కరోనా బాధితులతో పాటు ఇతర సమస్యలు ఉన్నవారికి వైద్యులు చికిత్స చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించి బ్రిటన్ ముందుగానే సిద్ధమైంది.
ఆలస్యంగా స్పందించారు..