తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూజీసీ నెట్​ పరీక్ష ఈ నెల 24కు వాయిదా - UGC NET exam new dates

యూజీసీ నెట్ పరీక్ష మరోసారి వాయిదాపడింది. ఈ నెల 16 నుంచి ఐసీఏఆర్​ పరీక్షలు జరగనున్న వేళ.. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

UGC-NET exam postponed, to be conducted Sep 24 onwards
యూజీసీ నెట్​ పరీక్ష ఈ నెల 24కు వాయిదా..

By

Published : Sep 14, 2020, 8:02 PM IST

Updated : Sep 14, 2020, 8:21 PM IST

జాతీయ అర్హత పరీక్ష(నెట్​) మరోసారి వాయిదాపడింది. ఈ నెల 16-25 మధ్య జరగాల్సిన ఈ పరీక్ష​ను 24 నుంచి నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది.

నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ అధ్వర్యంలో సెప్టెంబర్​ 16, 17, 22, 23 తేదీలలో ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ అగ్రికల్చరల్​ రీసెర్చ్​(ఐసీఏఆర్​) పరీక్షలు జరగనున్నాయి. అదే సమయంలో నెట్​ పరీక్ష నిర్వహిస్తే.. రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులు నష్టపోతారన్న ఆందోళనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది విద్యాశాఖ.

ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే పరీక్షలను విడివిడిగా నిర్వహిస్తున్నట్టు చెప్పిన అధికారులు.. త్వరలోనే అధికారికంగా నెట్​ పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్​ ప్రకటిస్తామని తెలిపారు.

ఇదీ చదవండి:'విద్యార్థుల భవిష్యత్తు కోసమే చివరి ఏడాది పరీక్షలు'

Last Updated : Sep 14, 2020, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details