తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైడెన్ బృందంలో మాల- ఉడుపి వాసుల హర్షం - తాజా వార్తలు మాలా

అమెరికాకు కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా నియమితులవ్వనున్న భారత సంతతికి చెందిన 'మాలా అడిగా' సొంతూరు కర్ణాటక ఉడుపి జిల్లాలోని కుక్కుంజే గ్రామం. శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో పనిచేసే అవకాశం మాలకు దక్కడంపై ఆమె బంధువులు హర్షం వ్యక్తంచేశారు.

Udupi Origin Woman Mala Adiga
అగ్రరాజ్యంలో 'మాల అడిగా' కేరాఫ్​ ఉడిపి

By

Published : Nov 23, 2020, 2:06 PM IST

ఇప్పటికే భారత మూలాలున్న కమలా హారిస్​ అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా గెలిచి చరిత్ర సృష్టించారు. తాజాగా భారత సంతతికి చెందిన మాలా అడిగా అరుదైన ఘనత సాధించారు. ఏకంగా అగ్రరాజ్యానికి కాబోయే ప్రథమ మహిళ జిల్​ బైడెన్​కు పాలసీ డైరెక్టర్​గా నియమితులయ్యారు. ఈ విజయంపై ఆమె సొంతూరైన కర్ణాటక ఉడుపి జిల్లాలోని కక్కుంజే గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆమె గురించి మరిన్న విశేషాలు తెలుసుకుందాం.

  1. మాల.. అమెరికాలోని ఇల్లినాయిస్‌లో పుట్టిపెరిగారు.
  2. ఆమె తల్లిదండ్రులు కర్ణాటక ఉడుపి నుంచి వలస వెళ్లారు.
  3. 'యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో' లా స్కూల్‌లో డిగ్రీ పూర్తి చేశారామె.
  4. లోవాలోని గ్రిన్నెల్‌ కాలేజీ నుంచి స్పానిష్‌లో బీఏ పట్టా పొందారు.
  5. కెరీర్‌ ప్రారంభంలో అమెరికా జిల్లా కోర్టు న్యాయమూర్తి దగ్గర సహాయకురాలిగా పనిచేశారు.
  6. తరువాత షికాగోలోని కిర్క్‌లాండ్‌ అండ్‌ ఇల్లీస్‌ ఎల్‌.ఎల్‌.పి.లో లిటిగేషన్‌ అసోసియేట్‌గానూ విధులు నిర్వహించారు.
  7. కొన్నాళ్లకు న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టిన ఆమె 2008లో బరాక్‌ ఒబామా ప్రచార బృందంలో చేరారు.
  8. ఒబామా అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన పాలనలో అసోసియేట్‌ అటార్నీ జనరల్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా నియమితులయ్యారు.
  9. బ్యూరో ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కల్చరల్‌ అఫైర్స్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీగానూ బాధ్యతలు చేపట్టారు.
  10. స్టేట్‌ సెక్రటరీలో గ్లోబల్‌ ఉమెన్స్‌ సమస్యలను పరిష్కరించే విభాగంలో చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా పనిచేశారు.
  11. అనంతరం బైడెన్‌ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల విభాగం డైరెక్టర్‌గానూ ఉన్నారు.
  12. తాజా ఎన్నికల్లో 'బైడెన్‌-హారిస్‌' ప్రచార బృందంలో కీలక పాత్ర పోషించారు.
  13. ఆమె శ్రమకు గుర్తింపుగా శ్వేతసౌధం నూతన పాలకవర్గంలో కాబోయే ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
  14. అమెరికాను మెరుగైన దిశగా నడిపేందుకు మాలా అనుభవం ఉపయోగపడుతుందని కొనియాడారు బైడెన్‌.

మాలా సాధించిన ఘనతపై గ్రామ ప్రజలతో సహా ఆమె బంధువులు హర్షం వ్యక్తం చేశారు. భారత జాతి కీర్తిని మరోసారి మాలా పెంచారని ఆమె బంధువు చంద్రశేఖర్​ నవుడా అన్నారు. ఆమె ఇంతకుముందు పలుసార్లు కర్ణాటకలో తమ బంధువుల శుభకార్యాలకు వచ్చినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details